మద్యానికి అలవాటైన వ్యక్తి మృతి – గోపాల్పేట ఎస్సై నరేష్ కుమార్
అక్షర విజేత ఉమ్మడి గోపాల్పేట్:
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని బుద్ధారం గ్రామానికి చెందిన రవీంద్ర గౌడ్ (36) అనే వ్యక్తి మద్యానికి అలవాటు పడి చనిపోయిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం రవీంద్ర గౌడ్ భార్య భాగ్యలక్ష్మి వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానం కలరు ఇదిలా ఉండగా భర్త రవీంద్ర గౌడ్ గత పది సంవత్సరాల నుండి మద్యానికి అలవాటు పడడంతో గురువారం తన భర్త రవీంద్ర గౌడ్ గోపాల్పేట నుండి ఎదుట్ల పోయే రోడ్డులో రోడ్డు పక్కన బోర్లపడి చనిపోవడం జరిగింది అని ఫిర్యాదు చేయగా కేస్ చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించడం మైనదని ఎస్సై నరేష్ కుమార్ తెలిపారు